ప్రశ్నార్థకమవుతున్న మహిళల భద్రత.. డీప్ ఫేక్‌లపై కేంద్రం నజర్

by GSrikanth |
ప్రశ్నార్థకమవుతున్న మహిళల భద్రత.. డీప్ ఫేక్‌లపై కేంద్రం నజర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో డీఫ్ ఫేక్‌లు సంచలనం సృష్టిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలకు సంబంధిచిన డీఫ్ ఫేక్ వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. డీఫ్ ఫేక్ వీడియోల కారణంగా మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారబోతున్నదన్న ఆందోళనను ఇటీవల పలువురు రాజకీయ నాయకులు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం డీఫ్ ఫేక్‌పై స్పందించారు. దీని బాధితులలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఉండటం చర్చనీయాశం అయింది. ఈ నేపథ్యంలో డీఫ్ ఫేక్ అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఈనెల 24న అత్యన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నది. ఈ సమావేశంలో డీఫ్ ఫేక్‌పై కేంద్ర ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed