సూర్యాపేటలో...పెయింటర్ అనుమానాస్పద మృతి

by Sridhar Babu |
సూర్యాపేటలో...పెయింటర్ అనుమానాస్పద మృతి
X

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి మురికి కాలువలో పడి మృతి చెందాడు. తొలుత వేరే రాష్ట్రానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తిగా భావించిన స్ధానికులు, పోలీసులు తర్వాత జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడు రాజీవ్ నగర్ కి చెందిన పూత శ్రీను అలియాస్ చిరంజీవి(43) గా తెలిసింది. అతడు రోజు వారి కూలీగా పెయింటింగ్ వర్క్ చేస్తారని, అతనికి మద్యం సేవించే

అలవాటు కూడా ఉందని తెలిసింది. మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. మరి కొందరు ఇతరులతో ఏమైనా గొడవ జరిగినట్లయితే కాలువలో పడవేసి ఉంటారేమో అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. బుధవారం స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story