అయ్యపల్లిలో భారీ చోరీ

by Sridhar Babu |
అయ్యపల్లిలో భారీ చోరీ
X

దిశ, లింగంపేట్ : లింగంపేట్ మండలం అయ్యపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన చల్ల దేవయ్య మంగళవారం సాయంత్రం ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలోని బంధువుల వద్దకు వెళ్లారు. బుధవారం ఉదయం వచ్చి చూడగా బీరువా ధ్వంసం చేసి ఉంది. ఇంట్లో పరిశీలించగా ఇంటి పైకప్పుకు వేసిన

ఇనుప సలాకలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని బీరువాలో దాచిన ఐదు తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి తో పాటు 50 వేల రూపాయల నగదు అపహరించుకుపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం చోరీ విషయాన్ని బాధితులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీం సిబ్బంది గ్రామాన్ని సందర్శించి నిందితుల వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed