లారీ బీభత్సం.. నవ వధువుతో పాటు,మరో వ్యక్తి మృతి

by Disha Web Desk 23 |
లారీ బీభత్సం.. నవ వధువుతో పాటు,మరో వ్యక్తి మృతి
X

దిశ,కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: వెనకనుంచి వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టిన ఘటనలో ఒక మహిళ తో పాటు, ఒక వాహనదారుడు మృతి చెందిన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోయిన్ పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... గుండ్ల పోచంపల్లి కె.వి.రెడ్డి నగర్ కాలనీకి చెందిన ఆకాశవార్యకు ముషీరాబాద్ కు చెందిన నందినితో గత ఏడాది వివాహం జరిగింది. సోమవారం హోలీ పండుగను పురస్కరించుకొని గుండ్ల పోచంపల్లి నుండి ముషీరాబాద్ కు రాత్రి 11 గంటల సమయం లో వెళుతున్న సమయంలో సుచిత్ర డైరీ ఫారం వద్దకు రాగానే వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ నెంబర్ ఏపీ 23 యు 7020 గల లో లారీ ఆకాష్ చౌవారియ నందిని ప్రయాణిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను ఢీకొట్టడంతో అదుపు తప్పి కింద పడిపోయారు.

కింద పడిన నందిని పై నుంచి లారీ ముందు టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. అదే లారీ ముందు వెళ్తున్న వాహనాలను సైతం ఒక పల్సర్ , యాక్టివా వాహనాలను సైతం ఢీకొట్టింది. యాక్టివా పై ప్రయాణిస్తున్న ఆకాష్ రాజు , పల్సర్ పై ప్రయాణిస్తున్న దుర్గా ప్రసాద్ లకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన నందిని ని ఆమె భర్త ఆకాష్ చవారియ సుచిత్ర లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న బోయిన్ పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పల్సర్ పై ప్రయాణిస్తున్న ఆకాశరాజు ను సైతం బాలానగర్ లో ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు .పల్సర్ పై ప్రయాణిస్తున్న దుర్గాప్రసాద్ కు గాయాలైనట్లు పేర్కొన్నారు. సంఘటన జరిగిన చోట ఫ్లైఓవర్ పనులు సాగుతుండటంతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది.లారీ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రైవర్ పరారీ లో ఉన్నాడని తెలిపారు. దీంతో నందిని భర్త ఆకాష్ చవారియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed