బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త పోర్న్ వీడియో కేసు అని బెదిరింపులు.. కట్ చేస్తే..?

by Rajesh |
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త పోర్న్ వీడియో కేసు అని బెదిరింపులు.. కట్ చేస్తే..?
X

దిశ, క్రైమ్ బ్యూరో : సైబర్ మోసగాళ్లు ఇప్పుడు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పేరును వాడుకుంటూ అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ఈ విధంగా మోసపోయిన ఇద్దరు నిందితులు ఈ మధ్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఎంత అమాయకంగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పేరుతో వాట్సాప్ వీడియో కాల్‌లో పరిచయం చేసుకున్న ఫేక్ పోలీసు అధికారులు చెప్పినట్లు చేసి మొత్తం బ్యాంక్ ఖాతాల్లో ఉన్న సోత్తును సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి పంపించేశారు.

శిల్పా శెట్టి పేరుతో చీటింగ్ ఇలా..

సికింద్రాబాద్‌కు చెందిన ఓ 80 సంవత్సరాల వృద్ధుడికి గుర్తు తెలియని వ్యక్తి పోలీసు యూనిఫాంలో ఉండి వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. తాము ముంబాయి పోలీసులమని పరిచయం చేసుకుని మీ బ్యాంక్ ఖాతాలోకి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియో కేసులో జరిగిన మని లాండరింగ్ వ్యవహారంలో కొంత డబ్బు మీ ఖాతాలోకి వచ్చింది. కాబట్టి మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాము. లేదంటే మీరు అమాయకులని తేలాలంటే మీ ఖాతాలో ఉన్న నగదు మొత్తం మేము చెప్పిన ఖాతాలోకి పంపండి అప్పుడు వాటిని పరిశీలించి మీకు తిరిగి వాపస్ చేస్తామని చెప్పారు.

లేదంటే ఈ కేసును మేము సీబీఐకి బదిలీ చేస్తున్నాము.. ఇంకా మొత్తం వారే చూసుకుంటారని తెలిపారు. మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ ఖాతా ఉన్న బ్యాంక్ పేరు, మీ పేరు ఇదే కదా అని ప్రశ్నించి మేము పోలీసులం కాబట్టి అన్ని కరెక్ట్‌గా చెప్పాము అని మాయ చేశారు. దీంతో వృద్ధుడు ఆన్ లైన్‌లోనే తన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా నుంచి వాటిని సేవింగ్ ఖాతాలోకి మార్చుకుని తిరిగి వాటిని సైబర్ మోసగాళ్ల ఖాతాల్లోకి మొత్తం రూ. 36 లక్షలు వేశాడు. సికింద్రాబాద్‌లోని మరో యువకుడుని కూడా ఇదే విధంగా బోల్తా కొట్టించి సైబర్ నేరగాళ్లు రూ. పది లక్షలు దోచేశారు.

అప్రమత్తంగా ఉండండి.. :సైబర్ క్రైం పోలీసులు

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మని లాండరింగ్ కేసులో మీ బ్యాంక్ ఖాతా వాడుకున్నారని చెప్పితే గందరగోళానికి గురి కాకండి. మీకు అతనికి ఏ సంబంధం ఉంది, మీకు అతనికి పరిచయం ఉందా అని ఒక సారి ఆలోచించుకోండి. మీరు అతనికి బ్యాంక్ ఖాతాను ఇస్తేనే అతను వాడుకుంటాడు కాని మీకు తెలియకుండా మీ బ్యాంక్ ఖాతాను వాడుకోలేరిని గుర్తించుకోండి. ఇలాంటి మాటలతో పోలీసు డ్రెస్సులో ఉండి వాట్సాప్ కాల్స్ చేసే వారంతా సైబర్ నేరగాళ్లను గుర్తించుకోండి.

పోలీసులు నేరుగా ఇంటికి వస్తారు. విచారిస్తారు, అవసరమైతే పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్తారు. అంతేగాని మొత్తం ఫోన్‌లోనే ఏ పోలీసు అధికారి విచారణ, దర్యాప్తు జరపరు అని గుర్తించుకోండి. ఒక శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్ర పేరు కాదు, గతంలో భారత దేశంలో జరిగిన బడా స్కాంల పేర్లు వాడుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టీ పోలీసులం అంటూ వీడియో కాల్స్‌లో బెదిరిస్తే వాటిని కట్ చేయండి లేదంటే ఏం చేసుకుంటారో చేసుకోమని బదులు ఇవ్వండని పోలీసు అధికారులు కోరుతున్నారు. అశ్లీల వీడియోలు, పోర్న్ వీడియోల ప్రచారంలో అతనిని 2021 సంవత్సరంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed