BREAKING : ఖమ్మంలో గంజాయి చాక్లెట్లు సీజ్.. పోలీసులు అదుపులో నిందితులు

by Shiva Kumar |
BREAKING : ఖమ్మంలో గంజాయి చాక్లెట్లు సీజ్.. పోలీసులు అదుపులో నిందితులు
X

దిశ, ఖమ్మం సిటీ : ఎక్సైజ్ ప్రొహిబిషన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి , ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం టూ టౌన్ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఆధ్వర్యంలో సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు అనుమానితులను సీఐ ఆర్.విజయేందర్ తన సిబ్బందితో తనిఖీ చేయగా.. వారి వద్ద ఎనిమిది కేజీల ఎండు గంజాయి, మూడు కేజీల గంజాయి చాక్లెట్లు లభించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారు ఔరంగాబాద్, మహారాష్ట్ర ప్రాంతాల్లో వాటిని తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు తమ విచారణలో వెళ్లడైనట్లుగా ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు.

Next Story