BREAKING: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం, నలుగురికి గాయాలు

by Shiva |
BREAKING: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం, నలుగురికి గాయాలు
X

దిశ, సూర్యాపేట: విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పాట్‌లో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలానికి చెందిన కొందరు యువకులు కారులో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే కారు సూర్యాపేట మండలం రాయన్‌గూడెం గ్రామ సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులు జటంగి సాయి (17), అంతటి నవీన్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న అబ్బూరి గణేష్, కావటి శివ‌లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే మారగోని మహేశ్, ఉదయ్, డ్రైవర్ చింతపల్లి ధనుష్ ఘటనా స్థలం నుంచి పరరయ్యారు. ఈ ఘటనపై అబ్బూరి గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ ఎస్సై బాలు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed