BREAKING: హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం.. రియల్టర్ కిడ్నాప్.. ఆపై దారుణ హత్య

by Shiva |
BREAKING: హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం.. రియల్టర్ కిడ్నాప్.. ఆపై దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 24న నగరంలోని చింతల్ వద్ద అదృశ్యమైన రియల్టర్ కుప్పం మధు దారుణ హత్యకు గురయ్యారు. కర్నాటక రాష్ట్రంలోని బీదర్ వద్ద ప్రత్యర్థులు ఆయనను అత్యంత దారుణంగా హతమార్చారు. ఏకంగా పెద్ద బండరాయితో మోది కత్తితో పొడిచారు. హత్య అనంతరం నిందితులు మధు మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మధును కిడ్నాప్ చేసిన వారే హత్య చేసి ఉంటారని వారు గుర్తించారు. మృతుడు మధు అదృశ్యమైన రోజు ఆయన వెంట ఉన్న రూ.5 లక్షల నగదు, ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు కూడా మాయం అయ్యాయి. అయితే, మధు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అయి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.

Next Story

Most Viewed