BREAKING:పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై హత్యాయత్నం కేసు

by Mamatha |
BREAKING:పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై హత్యాయత్నం కేసు
X

దిశ,వెబ్‌డెస్క్: మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ తగిలింది. పిన్నెల్లి పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏపీలో పోలింగ్ రోజున మాచర్లలో ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ చేపట్టగా మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పోలీసులు గుర్తించారు. తాజాగా పిన్నెల్లికి సంబంధించి మరో న్యూస్ ఏంటంటే..టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తుండగా..అడ్డుకోబోయిన తనపై దాడి చేసినట్లు శేషగిరి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా హైకోర్టు ఆదేశాలున్నా పిన్నెల్లి పై మరో తప్పుడు కేసు పెట్టారని వైసీపీ మండిపడుతోంది.

Next Story

Most Viewed