AP:ఇంగ్లాండ్‌లో ఆంధ్రా యువకుడు మృతి

by Jakkula Mamatha |
AP:ఇంగ్లాండ్‌లో ఆంధ్రా యువకుడు మృతి
X

దిశ,నరసరావుపేట: ఏపీలో యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లిన ఆంధ్రా యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆ యువకుడు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరుకు చెందిన సాయిరాం (24)గా గుర్తించారు. సాయిరామ్ ఉన్న‌త‌ చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. అయితే ఈ నెల 2వ తేదీన మాంచెస్టర్ బీచ్ వద్ద ఇంగ్లాండ్ పోలీసులు సాయిరాం మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే మాంచెస్టర్ పోలీసులు పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.Next Story

Most Viewed