ఏకే 47 మిస్ ఫైర్...అసిస్టెంట్​ కమాండర్​​ దుర్మరణం

by Disha Web Desk 15 |
ఏకే 47 మిస్ ఫైర్...అసిస్టెంట్​ కమాండర్​​  దుర్మరణం
X

దిశ, భద్రాచలం : ఏకే 47 మిస్ ఫైర్ కావడంతో అసిస్టెంట్ కమాండర్​ మృతి చెందిన సంఘటన భద్రాచలం ఏజెన్సీ, చర్ల మండలం, పుసుగుప్పలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే...బుధవారం ఉదయం 6 గంటల సమయంలో 81 సీఆర్పీఫ్, సివిల్ పోలీసులు, బీడీ టీమ్స్ తో కలిసి పుసుగుప్ప గ్రామ పరిసరాల్లో ఏరియా డామినేషన్‌ను నిర్వహించి తిరిగి జేటీఎఫ్ క్యాంపునకు తిరిగి వస్తున్నారు.

సుమారు 11.10 గంటలకు ఎంవీ శేషగిరి(47) అనే అసిస్టెంట్ కమాండర్​ ఓసీ -జి /81 బెటాలియన్ జేటీఎఫ్ క్యాంపు నుండి 400 మీటర్ల దూరంలో జారి పడిపోయారు. దాంతో అతని సొంత ఏకే -47 గన్​ నుండి ఒక రౌండ్ బుల్లెట్లు మిస్ ఫైర్ అయ్యాయి. దాంతో ఆయన ఛాతీపై బుల్లెట్ గాయమైంది. వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సీఆర్పీఫ్ 81 బెటాలియన్ అధికారుల ఫిర్యాదు మేరకు చర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story