తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. భక్తురాలు దుర్మరణం

by Disha Web Desk 1 |
తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. భక్తురాలు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ్య పుణ్యక్షేత్రమైన తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులోని ఆరో మలుపు వద్ద ఓ బైక్‌ అతివేగంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న జ్యోతి తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించి తోటి ప్రయాణికులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు తెలిపారు. మృతురాలు దాసరి జ్యోతి గుంటూరు జిల్లా మాచర్లలోని ఎర్రగడ వీధికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

Next Story

Most Viewed