హైదరాబాద్‌లో దారుణం.. ఉరివేసుకుని తల్లి, తండ్రి, కూతురు ఆత్మహత్య

by Disha Web Desk 19 |
హైదరాబాద్‌లో దారుణం.. ఉరివేసుకుని తల్లి, తండ్రి, కూతురు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ముషీరాబాద్‌లోని గంగపుత్ర కాలనీలో శుక్రవారం ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. భార్యభర్తలతో పాటు కూతురు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా లక్ష్మీపురం వాసులుగా గుర్తించారు. ఆర్థిక సమస్యలు భరించలేక తల్లి, తండ్రి, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed