ప్రమాదవశాత్తు గుంతలో పడి యువకుడు మృతి

by Taduka Kalyani |

ప్రమాదవశాత్తు గుంటలో పడి ఒక యువకుడు మృతి చెందిన సంఘటన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ప్రమాదవశాత్తు గుంతలో పడి  యువకుడు మృతి
X

దిశ, శంకర్ పల్లి : ప్రమాదవశాత్తు గుంటలో పడి ఒక యువకుడు మృతి చెందిన సంఘటన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మోకిలా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన తప్పెట అశోక్ (25) మోకిలలోని ఎస్ ఎస్ ఐ కన్స్ట్రక్షన్ నందు లేబర్ గా పని చేస్తున్నాడు. అయితే మంగళవారం పనిచేస్తున్న ప్రదేశంలోనే ప్రమాదవశాత్తు గుంటలో పడి చనిపోయాడని తెలిపారు. తల్లి రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Next Story