- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వ్యక్తిగత కారణాలతో యువకుడు ఆత్మహత్య
by Sridhar Babu |

X
దిశ, ఉప్పల్ : వ్యక్తిగత కారణాలతో వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి జిల్లా తుంగతుర్తి గ్రామానికి చెందిన వట్టిపల్లి శ్రావణ్ కుమార్(24) పీర్జాదిగూడ కుర్మానగర్ రోడ్ నెంబర్ 5 లో స్నేహితులతో కలిసి రూమ్ లో ఉంటున్నాడు. డెలివరీ బాయ్ గా జాబ్ చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున తన రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కు టవల్తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే చనిపోయడని మృతుని అన్న సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.
Next Story