- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
గంజాయి హబ్ @ బ్రాహ్మణపల్లి

దిశ, వైరా : గంజాయి.. ఇది ఒకప్పుడు నిషేధిత మాదక ద్రవ్యం.. ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో నిషేధిత మాదక ద్రవ్యమే అనుకోండి.. కానీ వైరా ఎక్సైజ్ పోలీసుల దృష్టిలో మాత్రం గంజాయి అనేది నిషేధిత మాదక ద్రవ్యమో కాదో తెలవటం లేదు. చిన్న చిన్న బెల్ట్ షాపుల పై దాడులు చేసి తమ ప్రతాపాన్ని చూపించే ఎక్స్చేంజ్ అధికారులు వైరా నడిబొడ్డులో నడిచే గంజాయి వ్యాపారం పై మాత్రం కనీసం దృష్టి సారించరు. ఖాకీ దుస్తులతో అర్ధరాత్రి వడ్డీ దుకాణాల పై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసే ఎక్సైజ్ అధికారులు వైరాలో అంతర్భాగంగా ఉన్న బ్రాహ్మణపల్లిలో నడుస్తున్న గంజాయి బాగోతంపై కనీసం దృష్టి సారించడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణపల్లిలో గంజాయి విక్రయాలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఒకటి రెండు సందర్భాల్లో వైరా పోలీసులు గంజాయి పై దృష్టి సారించి దాడులు చేశారు. కానీ ఎక్సైజ్ అధికారులు మాత్రం వైరా పట్టణంలో నడుస్తున్న గంజాయి విక్రయాల పై కనీసం దృష్టి సారించడం లేదు. ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు తీరును చూసి ప్రజలు ఇదంతా ఆ శాఖకు "మామూలే" అని చర్చించుకుంటున్నారు.
ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపుల పై నేరుగా దాడులు చేయకుండా ప్రైవేటు వ్యక్తులు బెల్ట్ షాపులపై దాడులు చేసి వారికి అప్పగించిన మద్యం పై, ఆ మద్యం దుకాణదారుల పై కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. కానీ గంజాయి గురించి మాత్రం వారికి పట్టదు. విధి నిర్వహణలో భాగమైన గంజాయిని అంతమొందించేందుకు ఎక్సైజ్ అధికారులు ఎందుకు పనిచేయడంలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కేవలం ఆర్టీసీ బస్టాండ్లో ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించి గంజాయి పట్టుకొని తమకు తామే సాటని, తామేదో విజయాన్ని సాధించినట్లు ప్రకటనలు చేస్తుంటారు. అయితే ఎక్సైజ్ ఆఫీసుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణపల్లి లో గంజాయి అమ్మకాలు జరుగుతున్న కనీసం పట్టించుకోరు. వైరాలోని బ్రాహ్మణపల్లి సమీపంలో వైరా రిజర్వాయర్ కుడి కాల్వ కట్ట పై నిరంతరం గంజాయి సేవించే యువత కనిపిస్తూ ఉంటారు. ఇదంతా ఎక్సైజ్ అధికారులకు తెలిసి కూడా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. స్వయానా సీఎం రేవంత్ రెడ్డి గంజాయి అమ్మకాల పై ఉక్కుపాదం మోపుతున్నామని గర్వంగా ప్రకటిస్తున్నప్పటికీ వైరాలో మాత్రం సీఎం ఆదేశాలు అమలు కావడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వైరాలో నడుస్తున్న గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు.