ప్రియుడి మోసానికి యువతి బలి..!

by Kalyani |   ( Updated:2024-10-08 15:32:21.0  )
ప్రియుడి మోసానికి యువతి బలి..!
X

దిశ, బెల్లంపల్లి : ప్రేమించి, తీరా కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని పెళ్లికి నిరాకరించడంతో మోసపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెల్లంపల్లి లో చోటుచేసుకుంది. బెల్లంపల్లి తాళ్ల గురజాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి మండలం చాకపల్లి గ్రామానికి చెందిన అక్కం అంజలి (18) గుడి పేట గ్రామానికి చెందిన యాటకర్ల రాజు మూడు సంవత్సరాల క్రితం పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమలో దించాడు. అతని మాయమాటలు నమ్మి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. రూ. 5 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ప్రియుడు రాజు పెళ్లికి నిరాకరించాడు.

అంతేకాకుండా బతుకమ్మ ఆడుకోవడానికి తనకు చెప్పకుండా వెళ్లిందని ఇంటికి వచ్చి మరి కొట్టాడు. అసభ్యకరమైన మాటలతో దూషించి వెళ్ళాడు. అంతటితో కాకుండా సెల్ ఫోన్ ఎప్పుడు బిజీ గా వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావని అనుమానాలతో వేధించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నావని మానసికంగా వేధింపులకు గురి చేస్తుండేవాడు. దీంతో అతని వేధింపులు, అవమానాన్ని, పెళ్లి చేసుకుంటానని మోసాన్ని తట్టుకోలేక అంజలి జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి శంకర్ తన కూతురు మరణానికి యాటకర్ల రాజు కారణమని తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed