విద్యుత్ షాక్‌తో యువతి మృతి..

by Disha Web |
విద్యుత్ షాక్‌తో యువతి మృతి..
X

దిశ, బాలానగర్: ప్రమాదవశాత్తు ఓ యువతి విద్యుత్ ఘాతుకానికి గురై దుర్మరణం చెందిన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేనగర్ డివిజన్ పరిధి శోభన కాలనీలో నివాసముండే మహ్మద్ ఖాజాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఉమేరా బేగం (17) మధ్యాహ్నం సమయంలో ఇంటిని శుభ్రం చేయడానికి బోర్ మోటర్ ఆన్ చేసింది. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత తిరిగి బోర్ మోటార్‌ను ఆఫ్ చేస్తుండగా తడి చేతులతో మోటార్‌ను తాకడంతో విద్యుత్ షాక్ గురై కిందపడిపోయింది. గమనించిన ఖాజా భార్య హలీమా బేగం స్థానికుల సహాయంతో కూతురును బాలానగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.Next Story