యువకుడి ప్రాణాలు తీసిన అతివేగం..

by Sumithra |
యువకుడి ప్రాణాలు తీసిన అతివేగం..
X

దిశ, ఎల్లారెడ్డి : అతివేగం ఓ యువకుడి ప్రాణాలను తీసింది. అతివేగంగా వచ్చిన ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు గ్రామానికి చెందిన చాకలి. ఏగొండ ( 18 ) ఎల్లారెడ్డి నుండి బిక్కనూరు గ్రామానికి వెళ్తున్నాడు. సరిగ్గా గ్రామ సమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి, తండ్రి రెండు నెలల క్రితం మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

Advertisement
Next Story