- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
పొలం దున్నుతుండగా తిరగబడ్డ ట్రాక్టర్.. బురదలో ఇరుక్కుని యువకుడి మృతి

దిశ, మంగపేట: కేజీ వీల్స్ ట్రాక్టర్‌తో స్వంత భూమిలో ధమ్ము చేయడానికి వెళ్లిన యువకుడు కోడెం సత్యనారాయణ (22) అంతలోనే ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. ఈ విషాద ఘనట మండలంలోని నర్సింహాసాగర్ పంచాయతీ గాంధీనగర్ గ్రామ శివారులో బుధవారం ఉదయం 9 గంటలకు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలన్న గూడెం గ్రామ పంచాయతీ నరేంద్రరావుపేటకు చెందిన కొడెం సత్యనారాయణ పూరెడుపల్లి శివారులోని తన సొంత భూమిలో వరి నాటు కోసం దమ్ము చేయడానికి ఉదయం 9 గంటలకు తన స్వంత ట్రాక్టర్ తీసుకొని వెళ్ళాడు.
ఈ క్రమంలో గాంధీనగర్ శివారు మూల మలుపులోని గూడూరు సత్యం వరి పొలంలో తిరిగి పడడంతో ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన సత్యం అక్కడి కక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి వెంటనే ట్రాక్టర్ కింద నుంచి సత్యనారాయణను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.