మరో చెయ్యి ఉంటే అతను బతికేవాడేమో...

by Sridhar Babu |
మరో చెయ్యి ఉంటే అతను బతికేవాడేమో...
X

దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాంసాగర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి వికలాంగుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంగల సంపత్ ( 45) అనే వ్యక్తి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వద్ద కుటుంబంతో సహా పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పశువులను మేపుతూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. మృతుని కి ఒక చెయ్యి లేక పోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. బావిలో నీరు అధికంగా ఉండడంతో రెస్క్య టీం సహకారంతో శవాన్ని వెలికి తీసినట్టు ఎస్సై సందీప్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Next Story

Most Viewed