ఉప్పల్ నల్ల చెరువులో మహిళ మృతదేహం లభ్యం.... ఆత్మహత్యనా...హత్యనా

by Sridhar Babu |
ఉప్పల్ నల్ల చెరువులో మహిళ మృతదేహం లభ్యం.... ఆత్మహత్యనా...హత్యనా
X

దిశ, ఉప్పల్ : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉప్పల్ నల్లచెరువులో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. రాత్రి 7 గంటలకు మృతదేహంను గమనించిన స్థానికులు పోలీస్ లకు సమాచారం అందించారు. వెంటనే పోలీస్ లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

చెరువు కట్టపై మృతురాలి ఐడీ కార్డు, చెప్పులు, వస్తువుల ఆధారంగా ఉప్పల్ జీహెచ్ఎంసీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న భరత్ నగర్ కు చెందిన కందుల శారదగా గుర్తించారు. మృతురాలి భర్త యాదగిరి గతంలోనే చనిపోయారు. వీరికి శ్రావణి, దివ్య అనే కూతుర్లు కలరు. మృతురాలికి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలు తనకు తాను సూసైడ్ చేసుకుందా లేక మరేధైన జరిగిందా అనే కోణంలో ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed