ద్విచక్ర వాహన దొంగలు దొరికారు

by Sridhar Babu |
ద్విచక్ర వాహన దొంగలు దొరికారు
X

దిశ, జగిత్యాల రూరల్ : ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొద్దిరోజుల క్రితం తిప్పన్నపేట గ్రామంలో రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన టూ వీలర్ ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బైక్ ఓనర్ భారతపు పెద్ది రాజం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం ఉదయం తిప్పన్నపేట గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.

పోలీసుల విచారణలో తిప్పన్నపేట బైక్ దొంగతనంతో పాటు, సారంగాపూర్ మండలం పెంబట్లలో ఒకటి , దండేపల్లి మండలంలోని పలు గ్రామాలలో మూడు బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 5 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరాలు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సుధాకర్, కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగాధర్, రాహుల్, ఉమర్,మోహన్ లను ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్ అభినందించారు.

Advertisement
Next Story