- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
ద్విచక్ర వాహనం అదుపు తప్పి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

X
దిశ, చిన్నశంకరంపేట : ద్విచక్ర వాహనం అదుపుతప్పి సాఫ్ట్వేర్ ఉద్యోగి బైక్ పై నుండి శుక్రవారం కిందపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన గొంతుకు లత - నర్సింలు కుమారుడు నిఖిల్ (26) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాదులో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి కింద పడి అపస్మారక పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా శనివారం నిఖిల్ మృతిచెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు నిఖిల్ మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది. కాగా ఒక కుమార్తె గలదు.
Next Story