చిట్ పండ్ హోర్డింగ్ దింపుతూ ఇద్దరు మృతి..

by Sumithra |
చిట్ పండ్ హోర్డింగ్ దింపుతూ ఇద్దరు మృతి..
X

దిశ, ఉప్పల్ : విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హబ్సిగూడ విజయలక్ష్మి ఆర్కేడ్ భవనం మూడో అంతస్తులో శుభ నందిని చిట్ పండ్ ఆఫీస్ ఉంది. ఎదురు బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న బాలు (37), మల్లేష్ (27) శుక్రవారం అర్ధరాత్రి సుభ నందిని చిట్ ఫండ్ హోర్డింగ్ దింపే ప్రయత్నం చేశారు.

ఈ సమయంలో హోర్డింగ్ జారి అక్కడే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగల పై పడడంతో ఇద్దరికి షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story