- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
కొల్చారంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..

దిశ, కొల్చారం : ఎదురు ఎదురుగా వస్తున్న కారు బస్సు ఢీ కొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం కొల్చారం జైన్ మందిర సమీపంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన టేక్మాల్ దుర్గా గౌడ్, తన సోదరుడు నాగరాజు గౌడ్, తల్లి లక్ష్మి, భార్య లావణ్య తన (9) నెలల పాపతో కలిసి కోడిపల్లిలో బంధువుల ఇంట్లో గురువారం జరిగిన ఫంక్షన్ కు వెళ్లారు.
శుక్రవారం సాయంత్రం తిరిగి స్వగ్రామానికి బయలుదేరగా మార్గమధ్యలో కొల్చారం జైన్ మందిర్ సమీపంలో మెదక్ నుండి సికింద్రాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో కారు నడుపుతున్న నాగరాజు గౌడ్ , (9) నెలల వయసున్న దుర్గ గౌడ్ కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో దుర్గా గౌడ్ , అతని తల్లి లక్ష్మి , భార్య లావణ్యలు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో దుర్గ గౌడ్, అతని తల్లి లక్ష్మిల పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను 108 సాయంతో మెరుగైన చికిత్స నిమిత్తం నర్సాపూర్ కు తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన నాగరాజుగౌడ్ మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై సార శ్రీనివాస్ గౌడ్ కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.