కర్ణాటక మద్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

by Jakkula Mamatha |
కర్ణాటక మద్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
X

దిశ, మంత్రాలయం రూరల్/కోసిగి: స్థానిక కోసిగి మండల పరిధిలోని కందుకూరు గ్రామ సమీపాన రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర అక్రమ కర్ణాటక మధ్యాన్ని సరఫరా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు, ఎస్ఐ చంద్రమోహన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. కడదొడ్డి గ్రామానికి చెందిన తోవి వినోద్, తిప్పలదొడ్డి గ్రామానికి చెందిన కాకంగారి జగదీష్, అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కర్ణాటక మద్యం (10) బాక్సులు,(960) టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని ఎస్సై చంద్రమోహన్ కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు పేర్కొన్నారు. అక్రమ కర్ణాటక మద్యం అమ్మిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story