గంజాయి కలకలం.. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వైనం..

by Aamani |
గంజాయి కలకలం.. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వైనం..
X

దిశ, శేరిలింగంపల్లి : గంజాయి విక్రయిస్తున్నారని పక్కా సమాచారంతో శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు మంగళవారం రాత్రి పలుచోట్ల రూట్ వాచ్ నిర్వహించారు. ఇందులో భాగంగా గచ్చిబౌలి డివిజన్ చిన్న అంజయ్య నగర్, నార్సింగిలో అక్రమ ఎండు గంజాయి విక్రయాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు డీటీఎఫ్ శంషాబాద్ బృందం అనుమానాస్పద వ్యక్తులను ఆపి తనిఖీలు చేయగా వేరు వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్ లో ఒడిశా రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ అలియాస్ మున్నా ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఎండు గంజాయి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఎస్‌హెచ్‌ఓ శేరిలింగంపల్లికి అప్పగించారు.

మరో ఘటనలో మంచిరేవుల బాలాజీ నగర్ లో అనుమానాస్పదంగా వెళుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన బిజయ్ బెహరా ను అదుపులోకి తీసుకుని విచారించగా అతని ద్విచక్ర వాహనం టీవీస్ స్పోర్ట్‌ లో బైక్ లో 700 గ్రాముల లూజు డ్రై గంజాను తరలిస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీజయ్ బెహరా ఒడిశా నుండి గంజాయి తీసుకువచ్చి నార్సింగి, కోకాపేట్, నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో తన బైక్‌ పై తిరుగుతూ గంజాయిని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం శంషాబాద్‌ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంలో శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ శ్రీకాంత్, సిబ్బంది గణేష్, నెహ్రూ, నిఖిల్, సాయి నిఖిల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story