ప్రేమ పెళ్లి.. మరోకరితో అక్రమ సంబంధం.. చివరికి జైలుకు..

by Disha Web Desk 13 |
ప్రేమ పెళ్లి.. మరోకరితో అక్రమ సంబంధం.. చివరికి జైలుకు..
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: కొత్తగూడెం పోస్ట్ ఆఫీసు సెంటర్ నందు జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సిఐ ఎల్ రాజు సోమవారం ప్రకటనలో తెలిపారు. సన్యాసి బస్తికి చెందిన గాయపాక ప్రవీణ్, అదే బస్తీలో ఉంటున్న లావణ్య ఇద్దరు ఐదు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం తరువాత అదే బస్తీకి చెందిన తంగెళ్ళ సుమంత్ తో లావణ్యకు పరిచయం ఏర్పడి.. ఇద్దరు కలిసి అక్రమ సంబంధం ఏర్పపరుచుకొని సహజీవనం చేస్తూ.. లావణ్య తన భర్త ను దూరం పెట్టినది. ఈ విషయంలో తరచూ భార్య భర్తల మద్య గొడవలు జరిగి లావణ్య తన పుట్టింటికి వెళ్లిపోయి సుమంత్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నది.


ఈ నెల 18న సాయంత్రం మృతుడు గాయపాక ప్రవీణ్ లావణ్య ఉండే ఇంటికి వెళ్ళి వారి అక్రమ సంబంధం గురించి నిలదీయగా లావణ్య ప్రియుడు సుమంత్ ఇంటి దగ్గర లేడు మరునాడు వస్తే మాట్లాడదామని చెప్పి అతనిని అక్కడినుండి పంపివేసింది. ఆ తరువాత నిందితుడు సుమంత్ ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరు కలిసి ప్రవీణ్ బ్రతికి ఉన్నంతకాలం ఆక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో అతనిని ఎలాగైనా చంపి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో పన్నాగం పన్నారు. ఆదివారం ఉదయం 08.00 గంటల సమయంలో గాయపాక ప్రవీణ్ లావణ్య ఉండే ఇంటికి వెళ్ళగా సుమంత్, లావణ్య ఇద్దరు కలిసి ప్రవీణ్ ను ఇనుప రాడ్డుతో,రోకలిబండతో విచక్షణా రహితంగా కొట్టి ఇంట్లో నుండి బయటికి లాకొచ్చి రోడ్ మీద పడేశారు. తరువాత లావణ్య నాపరాయి తీసుకొని అతని నడుము పై ఎత్తేసింది.

ఇంతలో ఇరుగుపొరుగు వారు చూస్తున్నారని వారిద్దరు అక్కడి నుండి పారి పోయియారు. ఈ విషయం ప్రవీణ్ తండ్రికి తెలిసి అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రవీణ్ చికిత్చ పొందుతూ మరణించాడు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకుని, వారు హత్య చేయడానికి ఉపయోగించిన ఒక ఇనుప రాడ్, రోకలి బండను వారి వద్ద నుండి స్వాదినం చేసుకుని రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడమైనది. ఇదిలా ఉండగా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు అసలు తెరవెనుక ఉండి కథ నడిపించిన నాయకుడిని కేసులో నుండి తప్పించారంటూ మృతుడు ప్రవీణ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు.


Next Story

Most Viewed