విషాదం...పిల్లలతో కలిసి తల్లి ఎంత పని చేసింది....

by Sridhar Babu |
విషాదం...పిల్లలతో కలిసి తల్లి ఎంత పని చేసింది....
X

దిశ,పెగడపల్లి : వ్యక్తిగత కారణాలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన వివాహిత మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రవి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం మండలం లోని మద్దులపల్లి గ్రామానికి చెందిన కంబాల హారిక(30)అనే వివాహిత తన ఇద్దరు పిల్లలు కృష్ణంత్(10), మయంత లక్ష్మి(8)లతో కలిసి తన ఇంట్లో గురువారం ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించగా అదే రోజున వారిని జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోదకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని, ఆమె పిల్లల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి సోదరుడు ఒళ్లెం కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై రవి కిరణ్ తెలిపారు.

Next Story

Most Viewed