విషాదం.. రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి..

by Disha Web Desk 11 |
విషాదం.. రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి..
X

దిశ, కృష్ణ/మక్తల్: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందగా మరో చిన్నారికి తీవ్ర గాయాలు అయిన సంఘటన గురువారం రాత్రి కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మాగనూరు మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన పల్లే అశోక్ (25) ఇందుపూరు గ్రామంలో భార్య వద్దకు బైక్ పై బయలుదేరాడు. అదే సమయంలో కృష్ణ మండలానికి చెందిన ఆంజనేయులు(35). నరసమ్మ (30) దంపతులు తమ పిల్లలు అనిరుద్(8), సోమ్రత (6)లతో కలిసి బైకుపై మక్తల్ లో జరిగే శుభకార్యానికి బయలుదేరారు. కాగా కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ శివారులో ఓ రైస్ మిల్ మలుపు వద్ద ఇరువురి ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో పల్లె అశోక్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆంజనేయులు, నరసమ్మ, అనిరుద్, సోమ్రతలు తీవ్రంగా గాయపడడంతో వారిని రాయిచూరు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా ఆంజనేయులు, నరసమ్మ, అనిరుద్ లు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి సోమ్రత ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని బంధువుల నుంచి సమాచారం. అశోక్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మక్తల్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed