బెల్లంపల్లి బార్ షాపులో దాడి కేసులో ముగ్గురు అరెస్ట్

by Sridhar Babu |
బెల్లంపల్లి బార్ షాపులో దాడి కేసులో ముగ్గురు అరెస్ట్
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కలకలం సృష్టించిన ఓ యువకుడిపై దాడి చేసిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం బెల్లంపల్లిలోని తన కార్యాలయంలో నిందితులను అరెస్టు చూపించారు. దాడికి సంబంధించిన పూర్వపరాలను బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ వెల్లడించారు. ఈ నెల 7న బెల్లంపల్లి కాల్టెక్స్ ఎస్ ఆర్ ఆర్ బార్లో తాన్డూర్ కు చెందిన బండారి వంశీ అనే వ్యక్తి పై గాంధీనగర్ కు చెందిన అల్లి సాగర్, పట్వాన్ పల్లి కి చెందిన త్నం సోమయ్య, మంచిరాల ఇస్లాంపూర్ కు చెందిన మామిడి అన్నమయ్య బీర్ సీసాలతో మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో వంశికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన నిందితులపై బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ అఫ్జలుద్దీన్ వివరించారు. మీడియా సమావేశంలో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై కె.మహేందర్ పాల్గొన్నారు.

Advertisement
Next Story