రామలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ.. మూడు హుండీలు ధ్వంసం

by Disha Web |
రామలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ.. మూడు హుండీలు ధ్వంసం
X

దిశ, వెల్దండ: గుండాల శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని గుండాల గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. మూడు హుండీలు ఎత్తుకెళ్లి ధ్వంసం చేసి నగదును పట్టుకెళ్ళారు. శుక్రవారం ఉదయం ఆలయ పూజారులు వెళ్లి చూడగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దొంగిలించిన హుండీలను చుట్టుపక్కల వెతికి చూడగా పక్కనే ఉన్న కేఎల్‌ఐ కాలువలో మూడు హుండీలు ధ్వంసం చేసి ఉన్నాయి. శివరాత్రి తర్వాత నుండి ఇప్పటివరకు దాదాపుగా నాలుగు నెలల వరకు భక్తులు సమర్పించిన కానుకల హుండీని లెక్కించలేదని అన్నారు. హుండీలో మొత్తం రూ.50 వేలు ఉండొచ్చు అని సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా క్లూస్ టీం చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరసింహులు తెలిపారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed