డిగ్రీ చదివే యువతి ప్రాణం తీసిన అనుమానపు భయం..

by Disha Web |
డిగ్రీ చదివే యువతి ప్రాణం తీసిన అనుమానపు భయం..
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో యువత చిన్న చిన్న విషయాలకే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అమ్మ మందలించిందనో.. నాన్న తిట్టడనో.. ప్రేమించిన వాళ్లు నిరాకరించారనో ఇలా ఏదో ఒక కారణం చేత ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకాలో జరిగింది. తల్లిదండ్రులు చదువుకోమని మందలించారనే కోపంతో ఓ యువతి తన ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని తుముకూరులో బెళ్లావికి చెందిన పవిత్ర అనే యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. పవిత్ర చదువుపై కంటే గేమ్స్‌లో ఎక్కువ యాక్టీవ్‌గా ఉండేది. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆమెను చదువుపై దృష్టి పెట్టమని మందలించెవారు. ఎప్పుడు గేమ్స్ ఆడుకుంటూ తిరుగుతావా.. శ్రద్ధగా చదువుకో అని కొప్పడేవారు. ఈ క్రమంలోనే పవిత్ర బాగా మనస్థాపానికి గురైంది. నేను బాగా చదవలేనేమోననే భయం తనలో మొదలయ్యింది. అంతే కాకుండా పరిక్షల్లో తక్కువ మార్కులు వప్తే తల్లిదండ్రులు మరళ కొప్పడతారని, తాను అడిగిన ఫోన్ కొనివ్వరేమోననే అనుమానంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సోమవారం ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

Next Story

Most Viewed