బయటకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన యువతి..

by Disha Web Desk 11 |
బయటకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన యువతి..
X

దిశ, చేగుంట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని చందాయిపేట గ్రామంలో చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నరసపూర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన పిల్లి నరసమ్మ భర్త చనిపోయిన తర్వాత తన చిన్న కూతురు పిల్లి నందిని (18) తో కలిసి తల్లిగారి ఊరైన చందాయిపేటలో ఈ నెల 10వ తేదీ నుంచి ఉంటున్నది.

ఈ నెల 17వ తేదీ బుధవారం మధ్యాహ్నం వేళ బయటకు వెళ్తున్న అని చెప్పిన నందిని సాయంత్రం వరకు రాకపోవడంతో చుట్టుపక్కన బంధువుల ఇంట్లో వెతికింది. నందిని ఆచూకీ లభించలేదు. నందిని తల్లి నరసమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story