టాయిలెట్ కు వెళ్లి వస్తానని బస్సు దిగిన మహిళ అదృశ్యం..

by Kalyani |
టాయిలెట్ కు వెళ్లి వస్తానని బస్సు దిగిన మహిళ అదృశ్యం..
X

దిశ, పరిగి: పరిగి బస్టాండ్​ లో టాయిలెట్ కి వెళ్లి వస్తానని బస్సు దిగిన మహిళ అదృశ్యమైంది. పరిగి ఎస్​ఐ పి.విఠల్​ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​ హైదర్​ గూడకు చెందిన యు. రవింద్​ రెడ్డికి రెండు నెలల క్రితం గుల్బర్గా జిల్లా ముదేల్​ మండలం కొనగడ్డ గ్రామానికి చెందిన రాజేశ్వరితో వివాహం జరిగింది. హైదర్​ గూడ నుంచి కొనగడ్డకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు.

పరిగికి రాగానే రాజేశ్వరి మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని బస్సులోంచి దిగింది. ఎంతసేపటికి తిరిగి రాలేదు. బస్టాండ్​ పరిసర ప్రాంతాల్లో వెతికినా రాజేశ్వరి ఆచూకీ లభించలేదు. దీంతో భర్త రవిందర్​ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్​ఐ పి.విఠల్​ రెడ్డి తెలిపారు.

Next Story