బైక్ పైనుంచి పడిన మహిళకు తీవ్ర గాయాలు

by Shiva Kumar |
బైక్ పైనుంచి పడిన మహిళకు తీవ్ర గాయాలు
X

దిశ, తాడ్వాయి : కుక్క అడ్డు రావడంతో బైక్ పైనుంచి పడిన మహిళ తలకు తీవ్ర గాయాలైన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అరగొండ గ్రామానికి చెందిన జంగిటి బాలమణి (50), భర్త కలిసి తన కూతురు ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి స్వగ్రామనికి వస్తున్న క్రమంలో తాడ్వాయి గ్రామ శివారులోని హనుమాన్ టెంపుల్ సమీపంలో వాహనానికి ఎదురుగా కుక్క అడ్డు రావడంతో బైకు పైన ఉన్న భర్త నారాయణ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుకాలే కూర్చున్న బాలమణి బైక్ పైనుంచి జారీ పడిపోయింది ఈ ప్రమాదంలో బాలమణి తలకు తీవ్రగాయలయ్యాయి. దీంతో స్థానికులు ఆమెను108 అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed