భర్త నిత్యం అలా చేస్తున్నాడని తట్టుకోలేని భార్య మర్మాంగాన్ని కోసేసి..

by Disha Web |
భర్త నిత్యం అలా చేస్తున్నాడని తట్టుకోలేని భార్య మర్మాంగాన్ని కోసేసి..
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో వివాహ బంధంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. భర్తపై భార్యకు, భార్యపై భర్తకు నమ్మకం లేకుండా పోతుంది. బయట జరిగే ఘటనలు తమకు ఆపాదించుకుని కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. అనుమానాలు పెంచుకుని పచ్చని సంసారాలను రోడ్డున పడేసుకుంటున్నారు. మరి కొందరు హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. భర్త నిత్యం అనుమానిస్తున్నాడని అతడి మర్మాంగాన్నే కోసేసింది ఓ ఇల్లాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కోల్హాపూర్ జిల్లా నందగావ్ ప్రాంతంలోని మంగూల్ వాడికి చెందిన మయాత్ ప్రకాశ్(52), వందన భార్య భర్తలు. కొన్ని రోజుల క్రితం ఒక ఫామ్‌హౌస్‌లో కూలీలుగా చేరారు. అక్కడ చేరినప్పటి నుండి భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించడం మొదలు పెట్టాడు. తాను అలాంటి దాన్ని కాదని భర్తకు ఎంత నచ్చజెప్పినా తరచూ మద్యం తాగి వస్తూ వందనను వేధించేవాడు. రోజు మాదిరిగానే మే16 రాత్రి బాగా తాగివచ్చిన ప్రకాశ్ భార్యను అనుమానిస్తూ తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేని భార్య అతడిని బలంగా తోసేసింది. దీంతో భర్త కిందపడిపోవడంతో క్షణికావేశంలో భార్య.. బండరాయితో అతడి తలపై మోదడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అయినా కోపం చల్లారని ఆమె.. వంటింటి నుంచి కత్తి తెచ్చి భర్త మర్మాంగాన్ని కోసేసింది. దీంతో భర్త ప్రకాశ్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.

అనంతరం ఆమె షాహూవాడీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త మద్యం మత్తులో కత్తితో మర్మాంగాన్ని కోసుకుని, తలను రాయికేసి కొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. ఘటనా స్థలానికి చేరేకున్న పోలీసులు ప్రకాశ్ మృతుదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మల్కాపూర్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో ప్రకాశ్‌పై హత్యయత్నం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు వందనను తనదైన స్టైల్‌లో విచారించగా నేరం ఒప్పుకుంది. వందనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

Next Story