ప్రాణం తీసిన దళితబంధు ట్రాక్టర్​..

by Disha Web |
ప్రాణం తీసిన దళితబంధు ట్రాక్టర్​..
X

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వ్యవసాయ బావిలో పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ యజమాని మృతి చెందాడు. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుడిని మానకొండూరు మండల కేంద్రంలోని బంజేరుపల్లెకు చెందిన శంకర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బావి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. అయితే, శంకర్ ఇటీవలే దళిత బంధు స్కీమ్ కింద ట్రాక్టర్ తీసుకున్నాడు. ఇంతలోనే ఈ దారుణం జరగడంతో శంకర్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed