- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కూకట్ పల్లిలో దారుణం… ఓ యువతి పై లైంగిక దాడి చేసి హత్య చేసిన దుండగులు
దిశ, కూకట్ పల్లి : ఓ గుర్తు తెలియని యువతిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా లైంగిక దాడి చేసి హత్య చేసిన సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్ పల్లి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కేపీబీ లోదా అపార్ట్మెంట్ ముందు ఉన్న ఉదాసీన్ మఠ్ అడవి ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం ఉందని స్థానికులు 100 నంబర్ కు సమాచారం అందించారు. దీంతో ఏసీపీ శ్రీనివాస్ రావు, కూకట్ పల్లి సీఐ ముత్తు, కేపీహెచ్బీ సీఐ వెంకటేశ్వర్ రావు లు సంఘటన స్థలాన్ని సందర్శించారు. చెట్ల పొదల్లో సుమారు 30 సంవత్సరాల వయస్సు కలిగిన యువతి మృతదేహం లభ్యం అయిందని తెలిపారు. ఒంటిపై దుస్తులు చిరిగి పోయి ఉన్నాయి. యువతి ఛాతి భాగంలో ఎడమ వైపు లక్కీ అనే ఇంగ్లీషు అక్షరాల్లో టాటూ, చేతిపై అమ్మవారి బొమ్మతో పాటు మరో టాటూ ఉందని ఏసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు. యువతిపై అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, యువతి కి సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియ లేదని ఏసీపీ తెలిపారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు.