కుక్కను హత్య చేసి ఆ భయంతో దారుణం

by Satheesh |   ( Updated:2022-08-18 13:03:10.0  )
కుక్కను హత్య చేసి ఆ భయంతో దారుణం
X

దిశ, కమలాపూర్: వరుస దొంగతనాలతో మండల కేంద్రంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్న తరుణంలో.. బుధవారం రాత్రి జరిగిన ఘటన మరింత భయానికి గురిచేస్తుందని కమలాపూర్ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగలు ఇంట్లో సొమ్మును కొల్లగొడుతున్నారు. ఇదిలా ఉండగానే.. నిన్న రాత్రి మండల కేంద్రంలో ఓ ఇంట్లో దుండగులు దొంగతనానికి యత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కుక్క వారిని చూసి మొరిగింది. దీంతో దొరికిపోతామని భయపడిన దుండగులు కుక్కును దారుణంగా కత్తితో పొడిచి చంపేశారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామస్తులు.. మరింత భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed