దొంగ‌ బాబాల లీలలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

by Disha Web |
దొంగ‌ బాబాల లీలలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: సాంకేతిక ప‌రిజ్ఞానం ఎంత పెరిగినా మూఢ‌న‌మ్మ‌కాల మాయ‌లో ప‌డి ప్ర‌జ‌లు న‌కిలీ బాబాల‌ను న‌మ్మి మోస‌పోతున్నారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని సొమ్ము చేసుకుని ఫేక్ బాబాలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి దొంగ‌బాబాల ఆట‌క‌ట్టించారు రాచ‌కొండ పోలీసులు. ఎల్బీన‌గ‌ర్‌లోని రాచ‌కొండ క‌మిష‌న‌రెట్ క్యాంపు కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేష్ భ‌గ‌వ‌త్ వివ‌రాలు వెల్ల‌డించారు. అంత‌ర్‌రాష్ట్ర న‌కిలీ బాబా ముఠాను అరెస్ట్ చేశామ‌ని తెలిపారు. రాజ‌స్థాన్‌కు చెందిన రామ‌నాథ్ (40), జొన్న‌త్ (33), గోవింద్‌నాథ్ (28), అర్జున్‌నాథ్ (22), పున‌రం (37), వ‌స‌నారాం (22), ప్ర‌కాష్ జోటా (27) ఏడుగురు నిందితుల‌ను భువ‌న‌గిరి ఎస్ఓటీ, భువ‌న‌గిరి టౌన్ పోలీసుల జాయింట్ ఆప‌రేష‌న్‌తో ఈ ముఠాను స‌భ్యుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. మ‌రో న‌లుగురు నిందితులు ప‌రారీలో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. వీరంతా రాజ‌స్థాన్‌లోని సిరోహి అనే ప్రాంతం నుండి వ‌చ్చి మోసం చేస్తున్నార‌ని తెలిపారు. పూజ‌లు చేసి అనేక దోషాల‌ను న‌యం చేస్తామంటూ మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు వివ‌రించారు.

కొండ‌ల్‌రెడ్డి అనే వ్య‌క్తి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించామ‌న్నారు. భువ‌న‌గిరికి చెందిన కొండ‌ల్‌రెడ్డి ట్రాన్స్‌ఫోర్ట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే కొండ‌ల్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం బైక్ మీద నుండి కింద ప‌డ్డాడు. ఇలా అనేక సార్లు ప్ర‌మాదాలు జ‌రుగుతుండ‌డంతో తెలిసిన వ్య‌క్తుల ద్వారా న‌కిలీ బాబాల‌ను క‌లిసారు. దీంతో కొండ‌ల్‌రెడ్డికి స్ప‌ర్ప దోషం ఉంద‌ని, పూజ‌లు చేయ్య‌క‌పోతే ప్రాణాలు పోతాయ‌ని న‌మ్మించారు. ఇలా పూజ‌లు, హోమాల పేరుతో కొండ‌ల్‌రెడ్డి నుండి రూ. 37 ల‌క్ష‌ల 71 వేలు వ‌సూలు చేశారు. తాను దొంగ బాబాల చేతిలో మోసం పోయాన‌ని తెలిసి కొండ‌ల్‌రెడ్డి పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుండి రూ. 8.30 ల‌క్ష‌ల న‌గ‌దు, 12 సెల్‌ఫోన్లు, కౌంటింగ్ మిష‌న్‌, రుద్రాక్ష మాల‌లు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ‌లోనే కాకుండా ఈ ముఠా ప‌లు రాష్ట్రాల‌లో ఇదే విధంగా అమాయ‌క ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన‌ట్లు మ‌హేష్ భ‌గ‌వ‌త్ వెల్ల‌డించారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed