- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వేధించిన కడుపునొప్పి...భరించలేక వృద్ధుడు ఆత్మహత్య
by Sridhar Babu |

X
దిశ, సైదాపూర్ : కడుపునొప్పి భరించలేక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్కెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెన్కెపల్లి గ్రామానికి చెందిన అమరగొండ వీరయ్య (75) అనే వృద్ధుడు గత కొద్ది కాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ శనివారం రాత్రి అమరగొండ కొమురయ్య చేదబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని కుమారుడు అమరగొండ మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై సీహెచ్. తిరుపతి తెలిపారు
Next Story