- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
మహిళా హత్య కేసులో వీడిన మిస్టరీ..
దిశ,షాద్ నగర్ : మాట మాట కలిపాడు.. చనువుగా మాట్లాడుతూ అని తెలుసుకున్నాడు. పైగా శారీరక సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు.. మహిళా వద్ద ఉన్న బంగారం,డబ్బులపై కన్నేశాడు.. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడు.ఈ సంఘటన షాద్ నగర్ పట్టణంలో 27న చోటుచేసుకుంది..షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపిన వివరాల ప్రకారం చౌదరిగూడ మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన కన్న భాగ్యలక్ష్మి (40) పట్టణంలోని అంబేద్కర్ కాలనీ నివాసం ఉంటూ డైలీ లేబర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగుతుంది.. అయితే ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని చాగపూర్ గ్రామానికి వడ్డే పరమేష్ అనే తన కుటుంబ సభ్యులతో కలిసి 8 నెలల క్రితం షాద్ నగర్ పట్టణానికి వచ్చాడని కూలి పనులు చేస్తున్న రమేష్ చెడు వ్యసనాలకు బానిస కావడం వలన నెలన్నర కిందట తన వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపారు.అప్పటి నుండి రూమ్ లో ఒంటరిగా ఉంటున్న అడ్డా పై కూలీగా పనిచేసేందుకు వెళ్తున్న క్రమంలో అడ్డాకూలీగా పై చేసే కన్నా భాగ్యలక్ష్మి పరిచయం అయిందని,ఈ పరిచయం లో భాగ్యలక్ష్మి తన భర్తను వదిలేసి ఒంటరిగా వుంటునాన్ని తెలిపిందని ఈ తరుణంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి శారీరక సంబంధం ఏర్పడిందని తెలిపారు.
పక్కా ప్లాన్ ప్రకారం హత్య..
నిందితుడు పరమేష్ కన్నా భాగ్యలక్ష్మి వద్ద అవసరం నిమిత్తం డబ్బులు తీసుకునే వాడని,తనని చంపేస్తే అడిగేవారు ఎవరు ఉండరని తన ఒంటిమీద బంగారం,డబ్బు తన సొంతం చేసుకోవచ్చని పక్క ప్లాన్ వేశాడని ప్లాన్ లో భాగంగా గత నెల 27 వ తేదీన కన్నా భాగ్యలక్ష్మి ని పరమేష్ తన రూమ్ కి పిలిచి ఇద్దరు కలిసి తిన్న తర్వాత రాత్రి 11 గంటల సమయంలో పరమేష్ తన కుడి చేతితో భాగ్యలక్ష్మి గొంతుపై గట్టిగా నొక్కి పట్టి ఎడమ చేతితో ఆవరకుండా నోటిఫై చేయి పెట్టాడని ఈ క్రమంలో భాగ్యలక్ష్మి కి ఊపిరి ఆడక చనిపోయిందని తెలిపారు. భాగ్యలక్ష్మి చనిపోయిన అనంతరం తన వంటి పై చెవి కమ్మలను,ముక్కు పుడక ఇతర వస్తువులను,రూ.5 వేలనగదును తీసుకొని ప్లాస్టిక్ కవర్ లో భాగ్యలక్ష్మి శవాన్ని బెట్టి ఛార్జర్ వైర్ తో కట్టి పడేశారని తెలిపారు.కాలనీ వాసుడు మహమ్మద్ సాదిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని భాగ్యలక్ష్మి ఫోటో ఆధారంగా విచారణ జరిపి నిందుతుడి పరమేష్ ను అరెస్ట్ చేసి పరమేష్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి బంగారాన్ని,5 వేల నగదు,2 మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని నింధుతుడిని రిమాండ్ కు తరలించామని తెలిపారు.అనంతరం హత్య కేసులో నిందితుడిని పట్టుకోవడానికి ప్రతిభ కనబర్చిన షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్,డీఐ ప్రశాంత్,ఎస్సై లు శరత్ కుమార్,సుశీల సిబ్బందికి రివార్డ్ లు అందజేశారు.