అన్నం తింటూనే అనంతలోకాలకు.. పెద్దకర్మకు వచ్చి హార్ట్ ఎటాక్‌తో మృతి

by Disha Web Desk 19 |
అన్నం తింటూనే అనంతలోకాలకు.. పెద్దకర్మకు వచ్చి హార్ట్ ఎటాక్‌తో మృతి
X

దిశ, ఖమ్మం రూరల్: పెద్దకర్మకు హాజరై భోజనం చేస్తుండగా హార్ట్ ఎటాక్ రావడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని మద్దులపల్లిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దులపల్లి గ్రామంలో ఓ మహిళ పెద్దకర్మ ఉండటంతో వారి సభ్యులకు గుండు చేసేందుకు పొన్నెకల్లు గ్రామానికి చెందిన జంపాల వీరయ్య (65) అనే వ్యక్తి వచ్చాడు. కర్మకు సంబంధించి పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తరువాత భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఇంట్లోకి తీసుకెళ్లి నీళ్లు తాపించేందుకు ప్రయత్నించగా.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి పరీక్షించేలోపే అప్పటికే మృతి చెందాడు. మృతుడు వీరయ్యకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


Next Story

Most Viewed