బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్..

by Disha Web |
బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్..
X

దిశ, నిజామాబాద్ క్రైం: బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌పై పోలీస్ కేసు నమోదైన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బర్కత్ పుర ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అరవింద్ పాఠశాలలోని విద్యార్థిని పై అసభ్యంగా ప్రవర్తించాడు. స్టూడెంట్‌పై శారీరక, మానసిక వేధింపులకు గురి చేశాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదే తరహాలో ఒకరిద్దరూ విద్యార్థినిల పట్ల సదరు ఉపాధ్యాయుడు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఆలస్యంగా చెప్పడంతో వారు తీవ్రంగా స్పందించారు. పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుని నిలదీయడమే కాకుండా జరిగిన విషయం పై ఆరా తీశారు. ఉపాధ్యాయుడిని చితకబాదే ప్రయత్నాలు చేశారు. రెండవ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story