వంట గదిలో భార్య పని ముగించిన భర్త.. వాళ్ల ఎంట్రీతో సీన్ రివర్స్

by Nagaya |
వంట గదిలో భార్య పని ముగించిన భర్త.. వాళ్ల ఎంట్రీతో సీన్ రివర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎదిగిన పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవలు పడకూడదు అంటారు. కానీ, ఓ భార్య అదే పనిగా తన ఎదుగొచ్చిన కొడుకు ముందే భర్తను తిడుతూ, కొడుతూ ఉండేది. దీంతో విసుకు చెందిన భర్త తన భార్యను పధకం ప్రకారం హత్య చేశాడు. వేరే వాళ్లు హత్య చేసినట్లుగా నమ్మించాడు. ఈ దారుణ ఘటన కడపలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పీకే దిన్నే మండలం ఇందిరానగర్‌కు చెందిన నరసింహరావు, లక్ష్మీదేవి భార్యాభర్తలు. వీరికి ఇంటర్ చదువుతున్న కొడుకు ఉన్నాడు. నరసింహరావు కడపలో ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నాడు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో భార్య తన కొడుకు ముందే ఇష్టం వచ్చినట్లు తన భర్తని తిడుతుండేది, కొడుతుండేది. దీంతో భార్యపై కోంతో ఊగిపోయాడు నరసింహరావు. భార్యను ఎలాగైన చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ నెల 23 న మరల వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో కోపంతో నరసింహరావు భార్యను గట్టిగా నెట్టాడు. ఆమె వంటగదిలో ఉన్న పదునైన రాయిపై పడటంతో లక్ష్మీకి తీవ్రగాయాలయ్యాయి. ఇదే అదునుగా భావించిన భర్త వెంటనే ఆమె గొంతు నొక్కి బలంగా నేలకేసి కొట్టి హత్య చేశాడు.

ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా యథావిధిగా స్కూల్‌కు వెళ్లాడు. లక్ష్మీదేవి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన స్థానికులు నరసింహరావుకు సమాచారం అందించారు. దీంతో ఏం తెలియనట్టుగా వ్యవహరించి తన భార్యను ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ మొదలు పెట్టారు. విచారణలో భార్య వేధింపులు తాళలేక భర్తే హత్య చేసుంటాడని అనుమానాలు లేవనెత్తాయి. కాగా.. అప్పటికే నరసింహారావు పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరికితే ఏమోవుతుందో అనే ఉద్దేశంతో పీకేదిన్నే ఆర్ఐ ఎదుట లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు' అని సీఐ చెప్పారు. ఈ మేరకు అతడిని అరెస్టు చేసినట్టు తెలిపారు.

Next Story

Most Viewed