కన్న కూతురిపై తండ్రి క్రూరత్వం.. కిరాతకంగా హింసించి చంపి, చిరవకు ఏం చేశాడంటే?

by Anjali |
కన్న కూతురిపై తండ్రి క్రూరత్వం.. కిరాతకంగా హింసించి చంపి, చిరవకు ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడటం కామన్ అయిపోయింది. కొంతమంది ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తే.. మరికొంతమంది తల్లిదండ్రుల పరువు పోతుందని ఆలోచించి, ఇంట్లో వాళ్ల ఇష్టపూర్వకంగా వేరే అబ్బాయిని వివాహం చేసుకుంటారు. కొందరు అమ్మాయిలు లవ్ చేసిన అబ్బాయితో ఇళ్లు వదిలి వెళ్తారు. దీంతో కుటుంబ పరువు పోతుందని కన్న కుమార్తె అని చూడకుండా హత్య చేస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో చూస్తున్నాం. తాజాగా.. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. 25 ఏళ్ల ఓ యువతి ఇంటి పక్క అబ్బాయిని ఇష్టపడింది.

ఇదే విషయాన్ని తల్లిదండ్రులకూ చెప్పింది. దీంతో వారు నిరాకరించారు. మరో అబ్బాయితో పెళ్లి చేశారు. అయినా కూడా ఆమె ఇష్టపడ్డ అతడే కావాలని కోరగా.. తండ్రి(తోతరామ్), తన సోదరుడు, బావ కలిసి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. అర్థరాత్రి ఆమె తండ్రి.. ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లే హైవేపైకి బైక్‌పై తీసుకెళ్లి.. కుమార్తె గొంతు నుమిలాడు. టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ కొనుక్కుని రామ్మని తన కుమారుడికి ఫోన్ చేసి చెప్పాడు.

అతడు తీసుకొచ్చిన యాసిన్‌ను ఆ అమ్మాయి గొంతులో, శరీరంపై పోశారు. అక్కడికక్కడే తను స్రృహ కోల్పోవడంతో మరణించిందని అక్కడే రోడ్డు పక్కన పొదల్లో పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం బాటసారులు నగ్నంగా సుమారు 40 శాతం కాలిన గాయాలతో ఆమె కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తోతారామ్‌కు కాల్ చేసి తన కుమార్తె తమ వద్దే ఉందని, రోడ్డు పక్కన కనిపించిందని తెలుపగా.. ఆయన ఖంగుతిన్నాడు. తన బిడ్డకు వివాహమైందని, అల్లుడి వద్ద ఉన్నదని బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె ఫొటోలను ఆమె తండ్రికి పంపగా, ఆమె తన బిడ్డ కాదని అన్నాడు. కానీ, మీరంతా కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేసిన సీసీటీవీ ఫుటేజీ ఉన్నదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తోతారామ్, ఆయన బావ దినేశ్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యాయత్నంలో మరికొందరి కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందని, వారికోసం వెతుకుతున్నామని పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed