- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఆనందంగా కూతురి పెళ్లి కార్డ్స్ పంచిన తండ్రి.. అంతలోనే విషాదం

దిశ, వెబ్‌డెస్క్: కూతరు పెళ్లి ఘనంగా నిర్వహించాలని అనేక ఆశలు పెట్టుకున్న ఆ తండ్రి ఆశలు అంతలోనే అడియాశలయ్యాయి. ఆనందంగా పెళ్లి పత్రికలు పంచి.. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి ఇంటిపెద్ద కాటికి చేరిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓడీ చెరువు మండలం నల్లగుట్లపల్లికి చెందిన కొట్టాల పద్మనాభరెడ్డి (55), తన చిన్న కూతురు(యశస్విని) పెళ్లి పత్రికలు పంచి స్కూటీపై ఇంటికి వెళ్లున్నాడు. నల్లగుట్లపల్లి రోడ్డు మలుపు తిరుగుతున్న సమయంలో వెనుక నుంచి అతి వేగంతో వస్తున్న కారు స్కూటీని బలంగా 'ఢీ' కొట్టింది. అలాగే ఓ పది మీటర్ల దూరం వరకు స్కూటీని ఊడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళుతున్న వ్యక్తి తలకు బలమైన గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు ఏడుస్తున్న తీరు.. అందరికీ కంటనీరు తెప్పిచ్చింది. ఐదు రోజుల్లో పెళ్లి కావాల్సిన ఇంట్లో విషాదం జరుగడం బంధువులను, గ్రామస్తులను శోకసముద్రంలో ముంచింది.