అక్క ఆత్యహత్యను వీడియో తీసిన సోదరుడు

by Nagaya |
అక్క ఆత్యహత్యను వీడియో తీసిన సోదరుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎవరైనా ఆత్యహత్యాయత్నానికి పాల్పడుతున్నారంటే వారిని రక్షించడానికి ప్రయత్నిస్తుంటాం. అందులోను మన రక్తసంబంధీకులే అటువంటి అఘాయిత్యాలకు పాల్పడితే మనం ఏం చేస్తామో చెప్పనవసరం లేదు. కానీ, తన సోదరి కళ్లముందే ఒంటికి నిప్పంటించుకుంటుంటే సోదరుడు వీడియో తీసిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట కిరోసిన్ పోసుకుని సరోజ అనే మహిళ ఒంటికి నిప్పు అంటించుకుంటుంటే... ఏమి పట్టనట్టు, వీడియోలు తీస్తూ పక్కనే ఉండి చోద్యం చూశాడు ఆమె సోదరుడు.

సరోజ ఆత్మహత్య చేసుకుంటుండగా ఆమె సోదరుడు వీడియో తీసిన సన్నివేశాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రక్తసంబంధీకులే రాక్షసులుగా మారారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, బాధితురాలి తల్లిదండ్రులు పొరుగువారు జరిగిన తీవ్ర వాగ్వాదం కారణంగా సరోజ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో సరోజ మెడ నుంచి నడుము వరకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.



Next Story